హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధూల్‌పేటలో రూ.16 లక్షల గంజాయి పట్టివేత

HYD: ధూల్‌పేటలో ఎక్సైజ్ పోలీసులు 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తరలిస్తున్న ఈ గంజాయి విలువ రూ.16 లక్షలుగా అంచనా వేశారు. ఈ కేసులో సాకేత్ బాబును అరెస్టు చేసి, గంజాయి తరలింపునకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.