హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్రలేవగానే టీ తాగుతున్నారా?

ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామందికి బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. టీలో ఉండే కెఫీన్ కడుపులో యాసిడ్స్ విడుదల చేస్తుంది. దీంతో కడుపులో, గుండెలో మంట వస్తుంది. టీ సహజ మూత్రవిసర్జన కారిణి. రాత్రంతా నీరు తాగకుండా ఉండి, ఉదయాన్నే టీ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ పెరుగుతుంది. జీర్ణక్రియ మందగించి, మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది.