రాత్రి వేళ ప్రశాంతమైన నిద్ర కోసం చిన్నపాటి అలవాట్లు ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పడుకోవడానికి గంట ముందే ఫోన్ల స్క్రీన్లకు దూరంగా ఉండటం వల్ల మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి గాఢ నిద్ర పడుతుందట. గోరువెచ్చని నీరు తాగడం, గదిని చల్లగా ఉంచుకోవడం కూడా సహకరిస్తాయి. రోజుకు 7గంటల నిద్ర గుండె ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ రాత్రి నుంచే ఈ అలవాటును పాటిస్తారా?
ఆరోగ్యం
రాత్రి నిద్ర కోసం ఈ టిప్ పాటించండి!


