హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాల మున్సిపాలిటీకి మరో ఆరు స్వచ్ఛ ఆటోలు

HNK: పరకాల మున్సిపాలిటీకి మరో ఆరు స్వచ్ఛ ఆటోలు వచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన 10 ఆటోలు పనిచేయక మూలనపడగా, అనంతరం కొనుగోలు చేసిన ఆరు ఆటోలు పారిశుద్ధ్య నిర్వహణకు సరిపోలేదు. దీంతో మరో ఆరు ఆటోలను కొనుగోలు చేశారు. వీటిని దసరా పండుగ సందర్భంగా మంగళవారం ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.