హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిషాసురమర్దినిగా భద్రకాళి అమ్మవారి దర్శనం

WGL: వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం హారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.