KMR: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన గోపాల్ రావు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా వినూత్న ఆలోచనతో లింగం ఆకృతిలో బతుకమ్మను తయారు చేశారు. సంప్రదాయ బతుకమ్మలకు భిన్నంగా ప్రత్యేకమైన ఆకృతిలో రూపొందించిన ఈ బతుకమ్మ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పూలతో అందంగా అలంకరించి, తన సృజనాత్మకతను చాటుతూ రూపొందించిన ఈ వినూత్న బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది.
తెలంగాణ
లింగం ఆకృతిలో సద్దుల బతుకమ్మ


