తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో వినూత్న కళారూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన పెరుగు లింగమూర్తి శివలింగం ఆకారంలో బతుకమ్మను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సంప్రదాయ బతుకమ్మకు భిన్నంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శివలింగం రూపంలో తీర్చిదిద్దడం విశేషంగా నిలిచింది.
తెలంగాణ
శివలింగం ఆకారంలో బతుకమ్మ


