హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ప్రథమ స్థానం

NZB: వరంగల్‌లోని లాల్ బహదూర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి మినీ సబ్‌ జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో NZB జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో NZB జిల్లా జట్టుకు చెందిన ZPHS విద్యార్థి అశ్వత్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని పాఠశాల పీఈటీ మెండే రమేశ్ తెలిపారు.