MLG: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలకు సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ఘనంగా ముగింపు పలికారు. ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని తోపుకుంటలో పూల బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ మహిళలు ‘పోయిరా గౌరమ్మ.. మళ్లీ రావమ్మా!’ అంటూ వీడ్కోలు పలికారు. వానలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని ప్రార్థించారు. అనంతరం సత్తుపిండి, ప్రసాదాలను వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ ఆనందాలను పంచుకున్నారు.
తెలంగాణ
పోయిరా గౌరమ్మ.. మళ్లీ రావమ్మా..!


