హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేకల దొంగతనం కేసులో నలుగురి అరెస్టు

JN: పాలకుర్తి మండలం గూడూరులో ఆరు మేకలను అపహరించిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఊర సృజన్‌కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన నాయిని రవి మేకలను మేతకు తీసుకెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం తనిఖీల్లో అనుమానాస్పద వాహనాన్ని పట్టుకుని నిందితులను గుర్తించారు.