హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టు ఏటిలో మునిగి యువకుడు మృతి

JN: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కడారి భానుప్రకాష్‌ నూతనకల్‌ మండలం గుండ్లసింగారం ప్రాజెక్టు ఏటిలో మునిగి ఆదివారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో చిరువ్యాపారం చేసుకుంటున్న భానుప్రకాష్‌ ఇద్దరు స్నేహితులతో కలిసి బతుకమ్మ పండగకు వస్తూ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు ఏటిలో దిగగా భానుప్రకాష్‌ నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.