హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీవ్ర విషాదం.. అనాథలైన చిన్నారులు

BDK: ఇల్లందు–ఖమ్మం రహదారిపై మంచుకొండ వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాదేపాడుకు చెందిన దంపతులు మద్దెబోయిన వెంకటేష్, రమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. వారికి ఇద్దరు చిన్నారులున్నారు. ఆటో నడుపుతూ తండ్రి, కూలి పనులు చేస్తూ తల్లి పిల్లల కోసం కష్టపడేవారు. విధి ఆడిన వింత నాటకంతో ఇద్దరు చిన్నారులకు అమ్మానాన్నలు దూరమవడం విషాదాన్ని నింపింది.