BDK: భద్రాచలం దివ్యక్షేత్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. పండుగను పురస్కరించుకుని గౌరమ్మలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు భక్తులు ఊరేగింపుగా బయలుదేరారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరమ్మలను నిమజ్జనం చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
భద్రాచలంలో గోదావరి తీరానికి బతుకమ్మలు


