HNK: దసరా పండుగ వరుస సెలవులు, పరిపాలనాపరమైన కారణాలతో సోమవారం హన్మకొండ కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, దరఖాస్తులతో కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'హన్మకొండలో నేటి ప్రజావాణి రద్దు'


