హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుట్టకోటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

KMM: ఖమ్మం నగరంలోని పుట్టకోట గ్రామం 15వ డివిజన్‌లో రావిచెట్టు వద్ద ఉన్న అమ్మవారి సన్నిధిలో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ సందడిగా తిరుగుతూ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, భక్తి పాటలతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.