MHBD: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఆదివారం బయ్యారం మండల కేంద్రంలోని కోదండరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ
పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే


