WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం తన భార్య, కుమార్తె స్వయంగా పేర్చిన బతుకమ్మతో వేడుకలకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే దొంతి


