హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సోదరిలు

HNK: ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో ఆదివారం మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు. మత భేదాలు లేకుండా అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలనే సందేశాన్ని తమ నృత్యాల ద్వారా చాటిచెప్పారు. ఈ వేడుకలు గ్రామంలో సోదరభావం, ఐక్యతను ప్రతిబింబించాయి.