హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

JN: నర్మెట్ట నుంచి జనగామకు వస్తుండగా గానుగుపహాడ్ సమీపంలో ఆదివారం స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ గిర్నిగడ్డకు చెందిన డ్రైవర్ మహమ్మద్ అలీ కుడికాలు మోకాలి కింద విరిగి తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు గుర్తించి 108కు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.