హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో మహిళ మృతి

WGL: వరంగల్ ఎనుమాముల పరిధిలోని కోట చెరువు వద్ద ఆదివారం సద్దుల బతుకమ్మ ఆడుతూ సూరారం సుజాత (60) గుండెపోటుతో మృతి చెందారు. రెడ్డిపాలెంకు చెందిన ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెకు భర్త వెంకటేశ్వర్‌రెడ్డి, కుమార్తె రంజని ఉన్నారు.