హైదరాబాద్: 28°C
తెలంగాణ

13 అడుగుల భారీ బతుకమ్మ వేడుకలు

NLG: మిర్యాలగూడ పట్టణంలోని గౌట్ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో 13 అడుగుల భారీ సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేయగా, ఎమ్మెల్యే సైతం వారితో కలిసి నృత్యం చేశారు.