BHNG: భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆదివారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన సతీమణి కిరణ్ జ్యోతితో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని పేర్కొంటూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
భువనగిరిలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే


