హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మట్టి దోపిడీపై ఉన్న శ్రద్ద ప్రజలపై లేదు'

PDPL: ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు మట్టి దోపిడీపైనే దృష్టి పెట్టి, మంథని ప్రజల ఆకలి, మనోభావాలను విస్మరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తమ్మిచెరువును సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్లు వచ్చే రోడ్ల పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కమీషన్లు రాని చెరువుల అభివృద్ధిని పక్కనబెట్టారన్నారు.