హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయ గోశాలలో భారీ నాగుపాము కలకలం

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ తిప్పాపూర్ గోశాలలో ఆదివారం సాయంత్రం భారీ నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపింది. గడ్డివాములో పామును గుర్తించిన సిబ్బంది గోశాల సూపరిండెంట్ అరుణ్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్ జగదీష్‌కు సమాచారం ఇవ్వగా, హుటాహుటిన వచ్చి చాకచక్యంగా పామును పట్టుకున్నారు.