హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లైఓవర్‌పై బోల్తాపడిన లారీ.. వైరల్‌గా మారిన వీడియో

SRPT: కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రహదారిపై ఫ్లైఓవర్ ఎక్కుతుండగా ఆదివారం రాత్రి ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వెనుక వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇతర వాహనదారులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.