హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

JGL: కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం పండగ రోజు నీళ్లు రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గత సిబ్బందిపై ఫిర్యాదుల నేపథ్యంలో తొలగించామని, తాత్కాలిక ఏర్పాట్ల వల్ల సమస్య వచ్చిందని సర్పంచ్ వివరించి, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.