హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ బందోబస్తును పరిశీలించిన: సీపీ

SDPT: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్‌ హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, సిద్దిపేట కోమటి చెరువులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఆమె, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.