SRCL: దసరా పండుగ కోసం గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. సర్పంచ్ వేముల విజయలక్ష్మీ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్మికుల సేవలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర కీలకమన్నారు.
తెలంగాణ
పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత


