హైదరాబాద్: 28°C
తెలంగాణ

విలువైన వస్తువులు ఇంట్లో ఉంచి ఊరెళ్లొద్దు: ఎస్సై

NRPT: దసరా సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని గుండుమాల్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్‌ చేయాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తలుపులు, కిటికీలు పటిష్ఠంగా మూసివేయాలని, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సూచించారు.