హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్

KNR: కరీంనగర్ మంకమ్మతోటలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు కనులపండువగా సాగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకల్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్ పాల్గొన్నారు.