BDK: భద్రాద్రి కొత్తగూడెంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని ఆదేశించారు. భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాలతో పాటు మండల పరిషత్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
'ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలి'


