హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లమల అడవులు.. ప్రకృతి సోయగాలు

నాగర్‌కర్నూల్ జిల్లా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది నల్లమల అటవీ ప్రాంతం. విస్తారమైన అడవులు, కొండలు, లోయలు, వన్యప్రాణులతో ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. అమ్రాబాద్ ప్రాంతంలో విస్తరించిన నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ పర్యావరణ పరిరక్షణలో కీలకమైనది. పులులు సహా అనేక రకాల వన్యప్రాణులు, పక్షులకు ఈ అడవులు ఆవాసంగా ఉన్నాయి.