హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన సర్పంచ్'

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నూతన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు, గ్రామంలో బతుకమ్మ విగ్రహం ఏర్పాటుతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.