హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

MNCL: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో గల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, రోగుల పరిస్థితి, ఆసుపత్రికి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.