హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప శిల్పకళకు విదేశీ సందర్శకురాలు ఫిదా

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన పిలిప గ్రాండీన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. కాకతీయుల కళావైభవం, అద్భుత శిల్పకళా సంపద గురించి గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా, ఆలయ శిల్పాలను చూసి ఆమె పరవశించారు.