WNP: పట్టణంలోని 1, 13, 14వ వార్డులో తాళ్ల చెరువు వాగు దుర్గంధభరితంగా మారింది. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. పందులు బురదను కదిలించడంతో వాసన తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వాగును శుభ్రం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: దుర్వాసనతో తాళ్ల చెరువు వాగు


