KNR: నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించాలని సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం హుజూరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రచార ఫ్లెక్సీ ద్వారా ప్రయాణికులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. భవిష్యత్ తరాల అవసరాల కోసం నీటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. తాగునీటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ అవగాహన కల్పించారు.
తెలంగాణ
'నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'


