BPT: పర్చూరు మండలంలోని చెరుకూరు గ్రామంలో ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా మహా చండీయాగం నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సర్వశుభాలు కలగాలని అమ్మవారి అనుగ్రహం కోసం ఈ యాగం చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరుకూరు ఆలయంలో మహా చండీయాగం.


