హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CPR శిక్షణతో ప్రాణాలు కాపాడవచ్చు: ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని ఏబీఎన్ అండ్ పీఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్‌లో నిర్వహించిన హ్యాండ్స్-ఆన్ సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.