హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ: డిసెంబర్ 2 వరకు సెక్షన్ 163 అమలు

విశాఖ తూర్పు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మహారాణిపేట, 2వ, 3వ, 4వ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో డిసెంబర్ 2వ తేదీ వరకు BNSS సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని ఆదివారం స్పష్టం చేశారు.