HYD: జూబ్లీహిల్స్లో మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనూజ రే హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఏడాది మే 8న జరిగిన హత్య కేసులో పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నేపాలీ నిందితులను తెలంగాణ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. ఆరు నెలలుగా ఉత్తరప్రదేశ్, బిహార్, నేపాల్ సరిహద్దుల్లో గాలించి నిందితులను పట్టుకున్నారు.
తెలంగాణ
తనూజ రే హత్య కేసులో నలుగురి అరెస్ట్


