హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి అభివృద్ధికి సహకరిస్తా: రాజా కృష్ణదేవరావు

WNP: సంస్థాన వారసుడు రాజా కృష్ణదేవరావును ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధిపై చర్చించి, సహకరించాలని కోరారు. వనపర్తి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాజా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను ఆయన అభినందించారు. వనపర్తిని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.