హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ వేళ.. బస్టాండ్లలో రద్దీ

KMM: దసరా పండుగకు సొంతూళ్లలో వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు ప్రారంభించారు. వరుస సెలవులు తోడవడంతో ఖమ్మంలోని పాత, కొత్త బస్టాండ్లలో రద్దీ పెరిగింది. కుటుంబాలతో పాటు విద్యార్థులు కూడా ఊళ్లకు వెళ్లేందుకు తరలిరావడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సి వచ్చింది. కొన్ని రూట్లలో సీట్ల కోసం పోటీ నెలకొంది.