హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజుల్లో 301 నామినేషన్లు

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. చైర్ పర్సన్ స్థానానికి 10 సెట్ల నామినేషన్లు మూడు రోజుల్లో మొత్తం దాఖలు అయ్యాయి. వార్డు మెంబర్లకు ఆదివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 206 నామినేషన్లు అభ్యర్థులు అందజేశారు. మూడు రోజుల్లో 40 వార్డులలో టిడిపి 141, వైసిపి 120, జనసేన 26, బిజెపి 20 మొత్తం 301 నామినేషన్లు దాఖలు అయ్యాయి.