ADB: ఆదిలాబాద్ DM&HO కార్యాలయం ఎదుట NHM ఉద్యోగులు చేపట్టిన దీక్ష ఆదివారంతో ఆరో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు AITUC పూర్తి మద్దతు ప్రకటించారు. AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విలాస్ మాట్లాడుతూ.. NHM ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'NHM ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'


