హైదరాబాద్: 28°C
క్రీడలు

బాబర్‌ ఆజం సరికొత్త చరిత్ర

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో 8000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి పాక్‌ బ్యాటర్‌గా అవతరించాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో బాబర్ తర్వాత యూనిస్ ఖాన్ (7717), అజర్‌ అలీ (5615) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.