హైదరాబాద్: 28°C
క్రీడలు

రంజీల్లో రింకూ సింగ్ సెంచరీల మోత

దేశవాలీ క్రికెట్‌లో టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగుతున్నాడు. రంజీ ట్రోఫీలో బిహార్‌పై తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతడు, గోవాతో రెండో మ్యాచ్‌లోనూ శతకం బాదాడు. 137 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో వీరోచితంగా ఆడి సెంచరీ సాధించాడు. ఒకవైపు రంజీల్లో వరుస సెంచరీలు చేస్తుంటే, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులోనూ అతనికి చోటు దక్కకపోవడం గమనార్హం.