నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఆదివారం వివిధ పార్టీల అభ్యర్థులు, మద్దతుదారులతో కిటకిటలాడింది. నామినేషన్ల దాఖలుకు మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుండటంతో అభ్యర్థులు ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. గడువు ముగిసే సమయానికి కార్యాలయంలో ఉన్న అభ్యర్థులందరికీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులతో నిండిన మున్సిపల్ కార్యాలయం


