హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసిపి అభ్యర్థిగా లలిత దేవి నామినేషన్

W.G: ఆకివీడు నగర పంచాయతీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ అభ్యర్థిగా మన్నె లలిత దేవి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడంతో వైసీపీ నాయకులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నియోజవర్గం ఇంఛార్జ్ యోగేంద్ర బాబు, జగ్గు రోజు విజయకుమార్ జ్యోతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గతంలో ఆమె ఆకివీడు సర్పంచ్‌గా పని చేశారు.