హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

ATP: అనంతపురం నగరంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆఖరు రోజున ప్రశాంత వాతావరణంలో ముగిసింది. SP జగదీష్ ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి బందోబస్తును పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.